Bansuwada | కానిస్టేబుల్, హోంగార్డు సస్పెన్షన్​

Bansuwada | దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్, హోంగార్డు సస్పెన్షన్​
Bansuwada | దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్, హోంగార్డు సస్పెన్షన్​

అక్షరటుడే, కామారెడ్డి : Bansuwada | విధి నిర్వహణలో దురుసుగా ప్రవర్తించిన బాన్సువాడ పోలీస్ స్టేషన్​లోని కానిస్టేబుల్, హోంగార్డులను ఎస్పీ రాజేశ్​ చంద్ర సస్పెండ్ చేశారు.

Advertisement
Advertisement

బుధవారం ఓల్డ్ బాన్సువాడలోని ఒక కల్లు దుకాణంలో గొల్ల శ్రీనివాస్ అనే వ్యక్తి తాగి న్యూసెన్స్ చేస్తున్నాడని సమాచారం వచ్చింది. దీంతో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ కిరణ్, హోంగార్డు గంగాధర్ అక్కడికి వెళ్లారు. మద్యం తాగి ఉన్న శ్రీనివాస్​పై కానిస్టేబుల్, హోంగార్డు దురుసుగా ప్రవర్తించారు. అతడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Banswada | కలుషిత నీరు తాగేదెలా?