అక్షరటుడే, వెబ్డెస్క్ : Contactors | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ ఎదుట శుక్రవారం కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. తమ బిల్లులు చెల్లించాలని వివిధ జిల్లాలకు చెందిన దాదాపు 200 మంది కాంట్రాక్టర్లు డిప్యూటీ సీఎంను కలవడానికి వచ్చారు. అయితే వారిని సెక్యూరిటీ సిబ్బంది ఆపడంతో ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్ల ఆందోళనతో సెక్రటేరియట్ నుంచి భట్టి విక్రమార్క వెళ్లిపోయారు. కాగా రాష్ట్రంలో చాలా పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల పనులను సైతం ఆపేశారు. అయినా నిధుల లేమితో ప్రభుత్వం వారికి బిల్లులు చెల్లించడం లేదు.
Contactors | డిప్యూటీ సీఎం ఛాంబర్ ఎదుట కాంట్రాక్టర్ల ఆందోళన
Advertisement
Advertisement