అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sri Reddy | సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు, వ్యాఖ్యల నేపథ్యంలో సినీ నటి శ్రీరెడ్డి విజయనగరం జిల్లా Vizianagaram district పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‌లో Pusapatirega police station పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Cm Nara Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేష్ మీద (Minister Nara Lokesh) అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు శ్రీరెడ్డిపై Sri Reddy ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో Nellimarla police station కేసు నమోదైంది. 41ఏ కింద విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులిచ్చారు.
విచారణ సందర్భంగా శ్రీరెడ్డి Sri Reddy కీలక విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. వైఎస్ జగన్ YS Jagan మీద అభిమానంతోనే పోస్టులు పెట్టినట్లు శ్రీరెడ్డి Sri Reddy అంగీకరించినట్లు సమాచారం. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని చెప్పినట్లు తెలిసింది. తదుపరి విచారణకు రావాలంటూ శ్రీరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నారు.
సోషల్ మీడియాలో social media అనుచిత పోస్టులు, వీడియోలు posts and videos పోస్టు చేశారంటూ.. శ్రీరెడ్డిపై Sri Reddy ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు స్టేషన్లలో తెదేపా, జనసేన Jana Sena శ్రేణులు ఫిర్యాదు చేయడంతో అనేకచోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో high court శ్రీరెడ్డి పిటిషన్ కూడా వేశారు.