అక్షరటుడే, న్యూఢిల్లీ: COURT : భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు(Lok Sabha Opposition Leader), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి సంభాల్ జిల్లా నాయస్థానం (Sambhal District Court) నోటీసులు జారీ చేసింది. “మా పోరాటం బీజేపీ(BJP), ఆర్‌ఎస్‌ఎస్(RSS)కు వ్యతిరేకంగానే కాదు, భారత్(INDIA)పై కూడా” అని ఆయన చేసిన ప్రకటనపై దాఖలైన ఫిర్యాదుకు సంబంధించి ఏప్రిల్ 4లోపు స్పందించాలని, లేదా వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఏప్రిల్ 4న కోర్టుకు హాజరు కావాలని నోటీసు(notice)లో ఆదేశించినట్లు న్యాయవాది (Advocate) గోయల్ తెలిపారు.
జనవరి 15న పార్టీ ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్(Indira Bhavan)’ను ప్రారంభించిన అనంతరం రాహుల్ గాంధీ బీజేపీని తీవ్రంగా విమర్శించారు. ఆ రోజు రాహుల్ గాంధీ ఏమన్నారని న్యాయవాది చెప్పారంటే..
“మా సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం లాగానే వేల సంవత్సరాల నాటిది. అది వేల సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంతో పోరాడుతోంది. మేము న్యాయమైన పోరాటం చేస్తున్నామని అనుకోకండి. ఇందులో న్యాయం లేదు. మనం బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనే రాజకీయ సంస్థతో పోరాడుతున్నామని మీరు నమ్మితే, ఏమి జరుగుతుందో మీకు అర్థం కాలేదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మన దేశంలోని ప్రతి సంస్థను స్వాధీనం చేసుకున్నాయి. మనం ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్, భారత రాజ్యంతో పోరాడుతున్నాం” అని అన్నారు.