అక్షరటుడే, వెబ్ డెస్క్ : విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణ కోసం ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆధ్వర్యంలో 10 లక్షల పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టినట్లు ఉత్తరాంధ్ర కన్వీనర్ రమణమూర్తి తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వెనక్కు తీసుకోవాలని, తక్షణం పది వేల కోట్ల రూపాయల సహాయాన్ని అందివ్వాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంటుకు సొంత గనులు కేటాయించాలన్నారు. భూములు ఇచ్చిన నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని చేయాలని కోరారు. స్టీల్ ప్లాంట్ మిగులు భూములను నిర్వాసితులకు పంచాలని, పర్మనెంట్ ఉద్యోగాల భర్తీలో నిర్వాసితులకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతి ఇంటి నుంచి ఒక పోస్టు కార్డును ప్రధాని నరేంద్ర మోడీకి పంపించాలని విజ్ఞప్తి చేశారు.