అక్షరటుడే, కోటగిరి : Cooperative Society | రైతుల బోనస్ డబ్బులు కాజేసిన కోటగిరి సహకార సంఘం ఛైర్మన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని సీపీఐ(CPI) నాయకులు, రైతులు(Farmers) డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా(Ambedkar Chowrasta) వద్ద వారు ధర్నా నిర్వహించారు.
అనంతరం తహశీల్దార్ కార్యాలయం(Tahsildar’s office)లో వినతిపత్రం అందజేశారు. సీపీఐ(CPI) మండల కార్యదర్శి ఏ విఠల్ గౌడ్, రైతు జిల్లా నాయకులు నల్లగంగాధర్ మాట్లాడుతూ.. సొసైటీ ధాన్యం విక్రయించని రైతుల పేర్లతో బోనస్ కాజేసిన ఛైర్మన్(chairman)పై తక్షణమే విజిలెన్స్ విచారణ(vigilance inquiry) జరిపించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు బుట్ట గంగాధర్, సాయిలు, రాములు, లక్ష్మణ్, శంకర్, చిత్తారి శీను, సీపీఐ నాయకులు నల్లగంగాధర్, రాములు, శంకర్, తదితరులు పాల్గొన్నారు.