అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీఏసీ (పేషెంట్ అటెండెంట్ షెల్టర్) నిర్వహణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కమిషనర్ మకరంద్ తెలిపారు. సెంటర్‌ను నిర్వహించేందుకు స్వచ్ఛంద సంస్థలు, పట్టణ సమాఖ్యలు, నెహ్రూ యువకేంద్రాలు, సంక్షేమ సంబంధ సంస్థలు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 13 నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఆసక్తి గల వారు నగర పాలక సంస్థలోని మెప్మా విభాగంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.