అక్షరటుడే, వెబ్డెస్క్ : Legislative Council | పంచాయతీరాజ్ సవరణ బిల్లును శాసనమండలిలో బుధవారం ఏకగ్రీవంగా ఆమోదించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఆమోదం పొందినట్లు మంత్రి సీతక్క తెలిపారు. కేంద్రం ఆ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తే రిజర్వేషన్లు పెరుగుతాయని ఆమె పేర్కొన్నారు. బిల్లు ఆమోదం సందర్భంగా ఆమె సభలో మాట్లాడారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. జిల్లాలు, మండలాల విభజన సమయంలో జరిగిన పొరపాట్లను సరిచేస్తామని ఆమె తెలిపారు.
Advertisement
Advertisement