అక్షరటుడే, వెబ్ డెస్క్: రైలు కింద పడి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ సమీపంలో చోటు చేసుకుంది. పోతంగల్ మండలం హెగ్డోలి గ్రామానికి చెందిన బండారి శైలజ(24), బండారి అనిల్ కుమార్(28)కు ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. అనిల్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. కాగా మంగళవారం తెల్లవారుజామున ఫకీరాబాద్ శివారులో గుర్తు తెలియని రైలు కింద పడి బలవణ్మరణానికి పాల్పడ్డారు. బందువుల దుష్ప్రచారం భరించలేక వీరిరువురు సూసైడ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఆత్మహత్యకు ముందు పోలీసులకు వీడియో పంపారని సమాచారం.