అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నగరంలోని ఖిల్లా కెనాల్‌కట్ట సమీపంలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో భార్యభర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు. స్వామి(45), దేవలక్ష్మి(40) దంపతులు బుధవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉండగా ఉదయం ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం పరీక్ష ముగిసిన అనంతరం ఇంటికి వచ్చి చూడగా తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఒకవైపు పరీక్ష ముగిసిన సంబరంలో విద్యార్థి ఇంటికి వెళ్లగా.. విగత జీవులై కనిపించిన తన తల్లిదండ్రులను చూసి బోరున విలపించాడు.