అంత్యక్రియల కోసం వెళ్లి అనంతలోకాలకు..

0

అక్షరటుడే, ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం పద్మాజివాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ మృతి చెందారు. మండల కేంద్రానికి చెందిన ఏనుగు జనార్దన్ రెడ్డి(52) అతని భార్య ప్రతిభతో కలిసి ద్విచక్ర వాహనంపై పద్మాజీవాడలో అంత్యక్రియలకు వెళ్లారు. పద్మాజీవాడ చౌరస్తా సమీపంలో వెనుక నుంచి వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో ప్రతిభ సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. జనార్దన్ రెడ్డికి తీవ్ర గాయాలవ్వగా హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. వీరి మృతితో సదాశివనగర్ మండల కేంద్రంలో విషాదం నెలకొంది.