Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పదినెలలు గడుస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. ‘వారిపై చర్యలు తీసుకునేందుకు మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత..? మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేవరకా..’ అని స్పీకర్‌నుద్దేశించి సూటిగా అడిగింది. బీఆర్‌ఎస్‌ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం, దానం నాగేందర్‌, తెల్ల వెంట్రావ్‌లపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌ రెడ్డి, వివేకానంద సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేశారు. దీనిపై న్యాయమూర్తులు బీఆర్‌ గవాయి, అగస్టీన్‌ జార్జ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.

Advertisement