అక్షరటుడే, వెబ్‌డెస్క్: JUDGEMENT | ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుల్లో ఏ–2గా ఉన్న సుభాష్ శర్మకు మరణశిక్ష విధించింది. మిగితా ఆరుగురు నిందితులకు జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఘటన జరిగిన ఆరేళ్ల తర్వాత తుది తీర్పు వెలువడింది. తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడు. కాగా అప్పట్లో ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
JUDGEMENT | ఐదేళ్లుగా సాగిన విచారణ..
అప్పట్లో కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీస్ యంత్రాంగం.. వేగవంతంగా విచారణ పూర్తి చేసింది. 8 మందిని నిందితులుగా 2019లో ఛార్జిషీట్లో దాఖలు చేశారు. సుమారు ఐదేళ్లకు పైగా న్యాయస్థానంలో విచారణ సాగగా సోమవారం శిక్ష విధించింది. కాగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అమృత తండ్రి మారుతీ రావు 2020 మార్చిలో సూసైడ్ చేసుకున్నాడు. అన్నతరం ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. చివరకు కోర్టు పై విధంగా తీర్పు చెప్పడం మరోమారు ప్రణయ్, అమృతల అంశం చర్చకు దారితీసింది.