అక్షరటుడే, వెబ్‌డెస్క్: Delhi CM | దేశ రాజధాని ఢిల్లీలో national capital Delhi నిత్యం రద్దీగా ఉంటుంది. లక్షల వాహనాలు రోడ్లపై తిరుగుతుంటాయి. దీంతో ట్రాఫిక్ జామ్‌లతో traffic jams వాహనదారులు ఇబ్బందులు పడుతుంటారు.
అయితే ఇది చాలదు అన్నట్లు రోడ్లపై పశువులు సంచరిస్తుండటంతో వాహనదారులు అసవ్థలు పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఢిల్లీ సీఎం రేఖాగుప్తా Delhi CM Rekha Gupta వీధుల్లో తిరుగుతున్న ఆవులను చూసి తన కాన్వాయి ఆపారు. రోడ్లపై ఆవులకు ఆహారం పెట్టడం మానేయాలని ప్రజలను ఆమె కోరారు. ఆవులను గోశాలలకు తరలించాలని, ఆహారం పెట్టాలనుకున్న వారు కూడా గోశాలలకు వెళ్లాలని ఆమె సూచించారు.