అక్షరటుడే, నిజామాబాద్‌: ఇటీవల అమలులోకి వచ్చిన నూతన న్యాయ చట్టాలపై ప్రతిఒక్కరికి అవగాహన తప్పనిసరి అని సీపీ కల్మేశ్వర్‌ పేర్కొన్నారు. నిజామాబాద్‌ నగరంలో గురువారం మీడియా ప్రతినిధులకు నూతన చట్టాలపై ఓరియంటేషన్‌ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష, భారతీయ సాక్ష్య అధినియం తదితర చట్టాల గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నారు. నిరంతరం వార్తలు రాసే మీడియా మిత్రులకు ఈ చట్టాలపై అవగాహన ఉంటే ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. ప్రజలు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోవద్దని.. ఇబ్బందులుంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు. అలాగే వీడీసీల పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కోటేశ్వర్ రావు, ఏఆర్ అడిషనల్ డీసీపీ శంకర్ నాయక్, నిజామాబాద్‌ ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి, ఆర్మూర్‌ ఏసీపీ బస్వారెడ్డి, బోధన్ ఏసిపి శ్రీనివాస్, సీసీఆర్ బీ ఏసిపి శ్రీనివాస్ రావు, ట్రాఫిక్ ఏసిపి నారాయణ, సీఐలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad cp | త్వరలో కానిస్టేబుళ్ల బదిలీలు.. కసరత్తు చేస్తున్న సీపీ