అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో వినాయక నవరాత్రోత్సవాలతో పాటు నిమజ్జన శోభాయాత్ర వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి సీపీ కల్మేశ్వర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. గణేశ్ ఉత్సవాలతో పాటు మిలాద్ – ఉన్ – నబి శాంతియుత వాతావరణంలో జరుపుకున్నారన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సహకరించిన ఉత్సవ సమితి సభ్యులు, ముస్లిం మత పెద్దలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.