అక్షరటుడే, వెబ్డెస్క్: Nizamabad cp | నిజామాబాద్ కమిషనరేట్(Nizamabad Commissionerate) పరిధిలో అర్ధరాత్రి వ్యాపారాలపై సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యేకించి హోటళ్లు, పాన్డబ్బాలు, టీ కోట్లు రాత్రి 10:30 గంటల్లోపే మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. మాట వినని వారిపై కేసులు నమోదు చేయిస్తున్నారు. పదేపదే నిబంధనలు ఉల్లంఘించే వారిపై సిటీ పోలీస్ యాక్ట్(City Police Act) కింద కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
నిజామాబాద్ నగరం(Nizamabad city)లో ఇటీవల పలు హోటళ్లు, పాన్ డబ్బాలు, టీ కోట్లు తదితర వ్యాపారాలు చేసుకునే వారు రాత్రి 11 గంటల తర్వాత కూడా తెరిచి ఉంచారు. స్వయంగా రాత్రివేళ గస్తీ తిరిగిన పోలీస్ బాస్ ఈ విషయమై ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్వో(SHO)లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేయాలని సూచించారు. ఆయన ఆదేశాలతో పలువురిపై కేసులు నమోదు చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా పలువురికి రెండు రోజుల చొప్పున జైలు శిక్ష పడటం గమనార్హం. ఈ ఘటనతో మిగతా వారు షాక్కు గురయ్యారు. రాత్రివేళలో పోలీస్ సైరన్ మోగగానే దుకాణాలను మూసివేస్తున్నారు.
Nizamabad cp | పక్కా ఆధారాలతో ఫొటోలు సేకరించి..
రాత్రి సమయంలో నిర్ణీత గడువు దాటిన తర్వాత వ్యాపారాలు నిర్వహించే వారిపై నిఘా ఉంచేందుకు వీలుగా సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) పక్కాగా వ్యవహరిస్తున్నారు. ఇందుకోసం సిబ్బందిని రంగంలోకి దించి వారితో ఫొటోలు తీయిస్తున్నారు. అనంతరం వాటిని సంబంధిత ఎస్హెచ్వోలకు పంపి పక్కా ఆధారాలతో కేసులు నమోదు చేయిస్తున్నారు. దీంతో న్యాయపరంగా.. హోటల్ నిర్వాహకులు తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. ప్రత్యేకించి రాత్రివేళల్లో శాంతిభద్రతలు పరిరక్షించేందుకు సీపీ ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
Nizamabad cp | ఐస్క్రీం షాపు యజమాని రెండు రోజుల జైలు
రాత్రి పదిన్నర గంటల తర్వాత ఐస్క్రీం షాపు తెరిచి ఉంచిన యజమానికి కోర్టు రెండు రోజుల జైలు శిక్ష విధించింది. ఆరో తేదీన వ్యాపార సమయం దాటిన తరువాత తెరిచి ఉంచడంతో దేవి రోడ్డులోని యజమానిని ఒకటో టౌన్ పోలీసులు మార్నింగ్ కోర్టు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. దీంతో షాపు యజమానికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు.