అక్షరటుడే, నిజామాబాద్‌ రూరల్ : రైతులందరికీ రుణమాఫీ చేయాలని సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా సహా కార్యదర్శి దాసు డిమాండ్‌ చేశారు. సోమవారం ధర్పల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిరికొండ మండలకేంద్రంలో పేదలు సాగు చేసుకుంటున్న భూములకు ఫారెస్ట్‌ అధికారుల ఒత్తిడి నుంచి రక్షణ కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కోరారు. తెయూలో ఇంజినీరింగ్‌ కోర్సులు ప్రవేశ పెట్టాలని, ఉద్యమ కళాకారులకు ఉపాధి కల్పన, పేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సబ్‌ డివిజన్‌ కార్యదర్శి వి బాలయ్య, ప్రజాసంఘాల నాయకులు పద్మ, గంగాధర్, సంజీవ్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Weather | తెలంగాణకు వర్ష సూచన