అక్షరటుడే, ఇందూరు: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి చెందడంతో పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సంతాపం తెలిపారు. జిల్లా కార్యాలయం ఎదుట ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల ఐక్యత కోసం, పార్టీ నిర్మాణంలో విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన మరణం తీరని లోటు అని పేర్కొన్నారు. ఏచూరి 2015లో రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా జిల్లాకు వచ్చారని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు, నూర్జహాన్, రామ్మోహన్, విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.