అక్షరటుడే, కామారెడ్డి: ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోమని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. శనివారం జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి సాగుచేసిన రైతులను తరుగు, తేమ పేరుతో ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. అధికారులు సైతం లారీలు, గోనెసంచుల కొరత లేకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, వెంకట్ గౌడ్, నర్సింలు పాల్గొన్నారు.