అక్షరటుడే, ఇందూరు: జీపీ కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు డిమాండ్ చేశారు. ధర్నాచౌక్ లో దీక్ష నిర్వహిస్తున్న కార్మికులకు బుధవారం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ప్రతినెలా వేతనాలు చెల్లించాలన్నారు. కార్మికులకు భద్రత కల్పించి పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. దీక్షలో యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజేష్, గంగాధర్, సీఐటీయూ నాయకురాలు నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు.