అక్షరటుడే, ఇందూరు: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని వీడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. సమావేశంలో కార్యదర్శి వర్గ సభ్యుడు పెద్ది వెంకట రాములు, నూర్జహాన్, శంకర్ గౌడ్, నన్నేసాబ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.