అక్షరటుడే, ఇందూరు: చందూరు గ్రామంలో 18 ఏళ్ల క్రితం నిరుపేదలకు పట్టాలిచ్చినా ఇప్పటి వరకు స్థలం కేటాయించలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 126 మందికి పట్టాలు మంజూరు చేసి ఏళ్లు గడిచినా స్థలం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. గ్రామంలో ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ..వాయిదాలు వేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ జోక్యం చేసుకొని పట్టాలు ఇచ్చిన పేదలకు స్థలాన్ని కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నన్నేసాబ్, సాయిబాబా, గంగామణి, రబియా, అమీనా, నసీమా, రజియా తదితరులు పాల్గొన్నారు.