అక్షరటుడే, ఆర్మూర్: షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆంక్షలు పెట్టడంతో 50 శాతం మంది రైతులు రుణమాఫీకి దూరమయ్యారన్నారు. ఎకరాకు రూ.7,500 చొప్పున రైతు భరోసా అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు ఎల్లయ్య, నాయకులు భూమన్న, అమీర్ ఖాన్, ఓంకార్, నవీన్, కిషన్, గణేష్, రవి, పోసాని, జయ, అజయ్ తదితరులు పాల్గొన్నారు.