NASA | ఐఎస్​ఎస్​​కు చేరుకున్న క్రూ-10 బృందం

NASA | ఐఎస్​ఎస్​​కు చేరుకున్న క్రూ-10 బృందం
NASA | ఐఎస్​ఎస్​​కు చేరుకున్న క్రూ-10 బృందం
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: NASA | సునీతా విలియమ్స్‌ను భూమ్మీదకు తీసుకువచ్చేందుకు పంపిన క్రూ–10 బృందం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS)కు చేరుకుంది. శుక్రవారం బయలు దేరి వెళ్లిన నలుగురు వ్యోమగాముల బృందం నేడు అంతరిక్షంలో ఉన్న సునీతా విలియమ్స్‌ బృందాన్ని కలుసుకుంది. దీంతో డాకింగ్‌, హ్యాచ్‌ ఓపెనింగ్‌ ప్రక్రియ విజయవంతమైనట్లు నాసా ప్రకటించింది. డ్రాగన్‌ క్యాప్సూల్‌లో ప్రయాణించి ఐఎస్ఎస్​లోకి ప్రవేశించిన వ్యోమగాములకు.. సునీతా విలియమ్స్‌ బృందం స్వాగతం పలికింది.

NASA | రెండు రోజుల పాటు హ్యాండోవర్​ ప్రక్రియ

ప్రస్తుతం ISSలో మొత్తం 11 మంది వ్యోమగాములు ఉన్నారు. తాజాగా చేరుకున్న క్రూ–10 బృందానికి హ్యాండోవర్‌ చేసే ప్రక్రియ రెండురోజులు పడుతుందని నాసా తెలిపింది. ఈ ప్రక్రియ అనంతరం భూమికి సునీతా, విల్మోర్‌ రానున్నారు.

NASA | 2024 జూన్​లో స్పేస్​ స్టేషన్​కు వెళ్లిన సునీత, బుచ్​

2024 జూన్​లో సునీత, బుచ్ 8 రోజుల మిషన్​లో భాగంగా స్పేస్​ స్టేషన్​కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆరుగురితో కూడిన సునీత బృందం తిరిగి వస్తున్నప్పుడు, స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక థ్రస్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరూ అంతరిక్షంలో చిక్కుకుపోయారు. వీరు అక్కడే ఉండి దాదాపు తొమ్మిది నెలలైంది.

NASA | క్రూ-10 మిషన్‌ చేపట్టిన NASA-SpaceX

కాగా.. సునీతా విలియమ్స్ – బుచ్ విల్మోర్​ను భూమి మీదకు తీసుకువచ్చేందుకు NASA-SpaceX శుక్రవారం క్రూ-10 మిషన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ మిషన్‌ను ఫాల్కన్–9 రాకెట్ ద్వారా ప్రయోగించారు. తొమ్మిది నెలలుగా ISSలో సునీతా, విల్మోర్‌తో పాటు వ్యోమగాములు నిక్‌ హేగ్‌, డాన్‌ పెటిట్‌, గోర్బునోవ్‌, అలెక్సీ ఓవ్‌చినన్‌ ఉన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Sunita Williams | సునీతా విలియమ్స్‌ ఆగమనం ఇప్పట్లో లేనట్లే..

NASA | 19న అంతరిక్షం నుంచి భూమి మీదకు..

సునీతా బృందం ఈనెల 19న అంతరిక్షం నుంచి భూమ్మీదకు రానుంది. అయితే.. తాజాగా వెళ్లిన క్రూ-10 బృందంలో నలుగురు వ్యోమగాములు ఉన్నారు. వీరిలో మెక్‌క్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ ఉన్నారు. కాగా.. అంతరిక్షంలో ఎక్కువ కాలం నిరంతరంగా ఉన్న మొదటి మహిళగా సునీత నిలిచారు.

Advertisement