Cricket tournament | లింగాయత్​ సంఘం ఆధ్వర్యంలో క్రికెట్​ టోర్నీ

Cricket tournament | లింగాయత్​ సంఘం ఆధ్వర్యంలో క్రికెట్​ టోర్నీ
Cricket tournament | లింగాయత్​ సంఘం ఆధ్వర్యంలో క్రికెట్​ టోర్నీ

అక్షరటుడే, బిచ్కుంద :Cricket tournament | రాష్ట్ర వీరశైవ లింగాయత్, లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రికెట్​ టోర్నమెంట్(State level cricket tournament)​ నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్లు దినేష్ పాటిల్, శెట్టి శివకుమార్ తెలిపారు. హైదరాబాద్​ శివారులోని అజీజ్​నగర్​ అప్ప జంక్షన్​ వద్ద గల పెవిలియన్​ క్రికెట్​ గ్రౌండ్​(Pavilion Cricket Ground)లో ఏప్రిల్​ 23 నుంచి మే 1 వరకు పోటీలు ఉంటాయని వారు వివరించారు.

Advertisement
Advertisement

టోర్నమెంట్​కు సంబంధించిన కరపత్రాలను సోమవారం మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార గ్రామంలో, బిచ్కుందలోని సద్గురు బండాయప్ప స్వామి(Sadguru Bandayappa Swamy) ఎడ్యుకేషన్ సొసైటీలో పంపిణీ చేశారు. ఆసక్తి గల వారు ఏప్రిల్​ 2లోపు రిజిస్టర్​ చేసుకోవాలని సూచించారు.

టోర్నీ(tourni)లో మొదటి బహుమతి రూ.55,555, రెండో బహుమతి రూ. 22,222 ఉందని వివరించారు. కార్యక్రమంలో రాచప్ప, అనిల్ కుమార్, బీర్కూర్ బస్వరాజ్ పటేల్, అడ్వకేట్ దినేష్ పటేల్, సంతోష్ అప్ప, ప్రదీప్ పటేల్, హుండే బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement