Nizamabad | ప్రజావసరాలు పట్టించుకోకుండా విమర్శలా..?

Nizamabad | ప్రజావసరాలు పట్టించుకోకుండా విమర్శలా..?
Nizamabad | ప్రజావసరాలు పట్టించుకోకుండా విమర్శలా..?
Advertisement

అక్షరటుడే ఇందూరు: Nizamabad | ప్రజావసరాలు పట్టించుకోకుండా విమర్శలు చేయడం కాంగ్రెస్ నాయకులకు తగదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో కేవలం ఒకేఒక ఫ్లైఓవర్ నిర్మించారని.. మిగితావన్నీ ఎంపీ అర్వింద్​ హయాంలోనే నిర్మించారన్నారు. గుత్ప ఎత్తిపోతల పథకాలు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పనులు ప్రారంభించారని గుర్తు చేశారు.

Nizamabad | ఫ్యాక్టరీ స్థలం ఎందుకు చూపించారు..?

నవోదయ విద్యాలయం కోసం నిజాం షుగర్ ఫ్యాక్టరీ స్థలాన్ని ప్రతిపాదించడంతో.. ఫ్యాక్టరీ తెరుచుకోదని అనుమానం కలుగుతుందన్నారు. ఫ్యాక్టరీ స్థలం కాకుండా వేరే చోట ఇస్తే ప్రజలు సంతోషించే వారన్నారు. జిల్లాలో పంటలు ఎండిపోతుంటే ఎలా కాపాడాలో కాంగ్రెస్​ నాయకులు మాట్లాడడం లేదన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  MP Arvind | జర్నలిస్ట్​ అరెస్ట్​ను ఖండించిన ఎంపీ అర్వింద్​

జక్రాన్​పల్లి విమానాశ్రయం గురించి పార్టీలకతీతంగా అర్వింద్​​ సీఎంని కలిశారన్నారు. విమర్శలు మానుకొని నవోదయ విద్యాలయం ఎలా రావాలో ఆలోచించాలని సూచించారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు మాట్లాడుతూ.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాంగ్రెస్ నాయకులు పనిగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. ఏడాది గడుస్తున్నా జిల్లాకు ఒక్క రూపాయి తెచ్చిన పాపాన పోలేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement