అక్షరటుడే, బోధన్: మండలంలోని బిక్‌నెల్లి, హంగర్గా గ్రామాల్లో భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. ఎస్సారెస్పీ వరదనీటితో దాదాపు వెయ్యి ఎకరాల్లో సోయా పంట నీటి పాలైంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. కష్టపడి సాగు చేసిన పంటలు వరదనీటిలో మునిగిపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రాజెక్టుకు మరింత ఇన్‌ఫ్లో పెరుగుతుండడంతో పంటలపై ఆందోళన చెందుతున్నారు.
Advertisement
Advertisement