Advertisement

అక్షరటుడే, ఎల్లారెడ్డి: మెదక్‌ జిల్లా చేగుంటకు చెందిన సీఆర్పీలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. ఎల్లారెడ్డి సమగ్రశిక్ష ఉద్యోగులు వారికి నివాళులర్పించారు. శనివారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు మృతిచెందిన సీఆర్పీల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎంఐఎస్‌ కో-ఆర్డినేటర్‌ అశోక్, ఐఈఆర్‌పీ వెంకటేశం, కంప్యూటర్‌ ఆపరేటర్‌ కాశీరాం, సీఆర్పీలు దత్తాత్రి, మహిపాల్, విజయలక్ష్మి, పీటీఐ రత్నయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  ACB RAIDS | ఏసీబీకి చిక్కిన మున్సిపల్​ ఆర్​ఐ