అక్షరటుడే, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ..సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా, మంత్రులు దుదిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉన్నారు. ప్రత్యేక అతిథిగా ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్రభుత్వ కార్యదర్శి ఈ కమిటీకి మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. ఈ కమిటీకి సంబంధించిన సమావేశాలకు స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, సంబంధిత శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు హాజరవుతారని ఉత్తర్వుల్లో తెలిపారు.