అక్షరటుడే, వెబ్‌డెస్క్ CSK vs MI : ధోని- రోహిత్ Dhoni- Rohit ఇప్పుడు ఇండియన్ క్రికెట్ Indian Cricket చరిత్రలో వారిద్దరికి ప్రత్యేక పేజ్ ఉంటుంది. Dhoni Team India ధోని టీమిండియాకి మూడు ఐసీసీ ట్రోఫీలు అందిస్తే.. రోహిత్ శర్మ కూడా అందించాడు. వీరిద్దరు గతంలో కలిసి పని చేశారు. కానీ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇవ్వడంతో రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా అద్భుతాలు చేస్తుంది. అయితే గ్రౌండ్లో ధోని-రోహిత్ Dhoni- Rohit ని కలిసి చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటారు. ఇప్పుడు అది ఐపీఎల్‌లోనే జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ Champions Trophy తర్వాత, ఇప్పుడు ఐపీఎల్ 2025 IPL 2025 హవా ఎక్కువైంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.
ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ Chennai Super Kings vs Mumbai Indians మధ్య జరిగే మ్యాచ్ పై అందరి దృష్టి నెలకొంది. ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంత పెట్టైన టిక్కెట్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దిగువ స్థాయి టిక్కెట్లు బ్లాక్ మార్కెట్లో పది రెట్లు ధరకు అమ్ముడవుతున్నాయంటే, ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఎదురుచూస్తున్నారో చూడొచ్చు.
చెన్నై తన సొంత మ్యాచ్‌లకు అధికారిక టిక్కెట్ల అమ్మకాన్ని ప్రారంభించనప్పుడే పరిస్థితి ఇలా ఉందంటే, ఇక టిక్కెట్లు మొదలైన వెంటనే ప్రైజ్ ఎలా ఉండబోతుందో అని ముచ్చటించుకుంటున్నారు. టికెట్ రీసేల్ వెబ్సైట్ వయా గోగో ప్రకారం, Chennai Super Kings vs Mumbai Indians చెన్నై vs ముంబై ఇండియన్స్ మ్యాచ్ కోసం కేఎంకే లోయర్ స్టాండ్ టిక్కెట్ల ధర ₹85,380కి వెళ్లిందని టాక్..!
ఇక ప్రారంభ ధర వచ్చేసి ₹12,512గా ఉంది. చెన్నై Chennai హోమ్ గేమ్‌ల టిక్కెట్లు ప్రస్తుతం వెబ్సైట్లో అందుబాటులో ఉండగా, వాటి కోసం ఎగబడుతున్నారు. చెన్నై వర్సెస్ ముంబై Mumbai మధ్య జరిగే మ్యాచ్ ఎల్లప్పుడూ ఐపీఎల్లో అతిపెద్ద, ఎగ్జైటింగ్ మ్యాచ్‌గా పరిగణిస్తున్నారు. ఈసారి కూడా ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి అభిమానులు చాలా ఆసక్తి చూపుతున్నారు. అయితే దీనిని కొందరు క్యాష్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. CSK IPL 2025 షెడ్యూల్ లో ముంబై ఇండియన్స్ తో MA చిదంబరం స్టేడియం, చెన్నై మార్చి 23 రాత్రి 7:30 గంటలకు ఒక మ్యాచ్ ఆడనుంది. తర్వాత వాంఖడే స్టేడియం, ముంబైలో 20 ఏప్రిల్ రాత్రి 7:30 గంటలకు మరో మ్యాచ్ ఉంటుంది.