అక్షరటుడే, బాన్సువాడ: మండలంలోని తాడ్కోల్ గ్రామానికి చెందిన ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని రూ.2.09 లక్షలు పోగొట్టుకున్న ఉదంతం బుధవారం వెలుగులోకి వచ్చింది. సీఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్కోల్ గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి ఫోన్ కు ఈనెల 8న ఓ మెసేజ్ వచ్చింది. క్లిక్ చేయడంతో రూ.400 బోనస్ అతని అకౌంట్లో జమయ్యాయి. దీన్ని నమ్మిన యువకుడు విడతల వారీగా రూ.2.09 లక్షలు వివిధ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంకా కొంత మొత్తం డబ్బులు పంపమని సైబర్ నేరగాళ్లు అడగడంతో అనుమానం వచ్చి యువకుడు 1930కు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.