అక్షరటుడే, వెబ్‌డెస్క్: ‘అమెరికాలో ఉన్న మీ కూతురు ఆపదలో చిక్కుకుంది. ఆ కేసులో నుంచి బయటకు రావాలంటే డబ్బులు కావాలి. ఇందుకోసం రూ.2 లక్షలు పంపండి’.. అంటూ సైబర్ నేరగాళ్లు కొత్తరకం మోసానికి పాల్పడ్డారు. ఓ రైతు నుంచి రూ.లక్ష కాజేశారు. కామారెడ్డి జిల్లా భవానీపేట్‌కు చెందిన ఓ రైతు కూతురు యూఎస్‌లో ఉంటోంది. శనివారం ఉదయం రైతుకు గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. మీ కూతురు ఆపదలో ఉందని చెప్పి నమ్మించిన వ్యక్తులు.. ఏడుస్తున్నట్లు శబ్దాలు వినిపించారు. వెంటనే రైతు మరో ఫోన్‌లో నుంచి తన కూతురు నంబరుకు ఫోన్ చేయగా కలవలేదు. సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మూడు విడతల్లో రూ.లక్ష నగదు బదిలీ చేశారు. ఆ తర్వాత కూడా డబ్బులు కోసం డిమాండ్ చేయగా.. అనుమానం వచ్చి బంధువుల ద్వారా తిరిగి కూతురిని సంప్రదించగా.. తాను మోసపోయినట్లు గుర్తించారు. ఈ విషయమై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.