విద్యార్థినులకు సైకిళ్ల అందజేత

0

అక్షరటుడే, ఆర్మూర్: దూర ప్రాంతాల నుంచి పాఠశాలలకు వెళ్లే విద్యార్థినులకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సైకిళ్లను పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నార్త్ సౌజన్యంతో రూ.50 వేల విలువ చేసే ఆరు సైకిళ్లను ఆదివారం ఆర్మూర్ రోటరీ క్లబ్ ప్రతినిధులు విద్యార్థినులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు గోపి, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ మోత్కురి లింగా గౌడ్, రోటరీ ప్రతినిధులు తులసి, ఎంకే నరేందర్, పుష్పకర్ రావు, హనుమంత రెడ్డి, రూపాలి మురళి, రాస ఆనంద్, దామోదర్, తదితరులు పాల్గొన్నారు.