అక్షరటుడే, హైదరాబాద్: Cyclone GHMC : తెలంగాణను అకాల వర్షాలు ముంచెత్తాయి. హైదరాబాద్‌పై తుఫాను పంజా విసిరింది. గురువారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా ఈదురుగాలులతో కుండపోత మొదలైంది. రాత్రి వరకు దంచికొట్టింది.
కేవలం జీహెచ్ఎంసీ పరిధిలో 5 గంటల్లోనే 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రధాన రహదారి, గల్లీ రోడ్డు తేడా లేకుండా నీటితో నిండిపోయాయి. బండ్లు వాన నీటిలో కొట్టుకుపోయాయి. పలుచోట్ల ఇళ్లల్లోకి నీరు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు దంచికొట్టాయి. కరీంనగర్, నిర్మల్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం మినహా.. మిగతా అన్ని ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.
Cyclone GHMC : పెచ్చులూడిన చార్మినార్..

ఈదురుగాలులకు చెట్లు కూలాయి. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులపై పెద్ద ఎత్తున వరద నిలవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వర్షానికి చార్మినార్ పెచ్చులు ఊడి కిందపడ్డాయి. భాగ్యలక్ష్మి దేవి ఆలయం వైపు ఉన్న మినార్ లో పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Cyclone GHMC : అత్యధికంగా ఇల్లందులో 13.6 సెం.మీ. వర్షపాతం
అత్యధిక వర్షపాతం నమోదైన 100 ప్రాంతాల్లో 90 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉదయం 6 గంటల వరకు నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే.. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 13.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్‌లో 10.8 సెం.మీ. వర్షం పడింది. హైదరాబాద్ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు పరిధిలో 9.98 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
Cyclone GHMC : పిడుగులకు ముగ్గురు బలి..
తెలంగాణలో పిడుగుపాటుకు ముగ్గురు బలి అయ్యారు. గద్వాల జిల్లాలో ఒకరు, నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరు మహిళలు మరణించారు.
- నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం కోడొనిపల్లికి చెందిన సుంకరి సైదమ్మ (40), గాజుల వీరమ్మ (50), పదర మండల కేంద్రానికి చెందిన పోతుల వినోద్ పొలంలో కూలి పనికి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలైంది. అదే సమయంలో పొలంలో పని చేస్తున్న సైదమ్మ, వీరమ్మపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సుంకరి లక్ష్మమ్మ మరో మహిళకు గాయాలయ్యాయి.
- గద్వాల జిల్లా మానవపాడు మండలం చంద్రశేఖర్ నగర్ గ్రామంలో పశువుల కాపరి వెంకటేశ్(45)పై పిడుగు పడింది. ఆయణ్ను వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
- గజ్వేల్ మండలంలోని జాలిగామ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ప్రైవేటు గోదాం ప్రహరీ కూలిపోయింది. ఈ ప్రమాదంలో గజ్వేల్ పట్టణానికి చెందిన ఎండీ హిమ్మత్ ఖాన్(52) మరణించాడు. మరో ఇద్దరు గాయపడ్డారు.
- పిడుగుల కారణంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఇప్రీతాబాద్ 20, వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఖాజాఅహ్మద్ పల్లిలో 23 మేకలు మరణించాయి.
- మూసీ పరిధిలోని శివాలయంలో దర్శనానికి వెళ్లి, వరదలో చిక్కుకున్న ఇద్దరు భక్తులను రెస్క్యూ బృందం సురక్షితంగా కాపాడింది.
Cyclone GHMC : విద్యుత్ సరఫరాకు అంతరాయం..
భారీ వర్షాలకు విద్యుత్తు సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. హైదరాబాద్ లో భారీ వర్షాలకు 449 ఫీడర్ల పరిధిలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎర్రమంజిల్, సోమాజిగూడ, దుర్గానగర్, బాగ్ లింగంపల్లి, హనుమాన్ టెడ్డీ, బీఎస్మక్తా, హైదర్‌గూడ, శ్రీనగర్ కాలనీ, టప్పాచబుత్ర, లంగర్ హౌస్, కార్వాన్ ప్రాంతాల్లో తీగలపై చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి.
Cyclone GHMC : నీటమునిగిన పంట..
రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు సెంటర్లలో, కల్లాల్లో కుప్పపోసిన వడ్లు, మక్కలు అకాల వర్షాలకు తడిసిపోయాయి. మొన్న పది రోజుల క్రితం కురిసిన గాలివానకు 11 వేలకు పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగింది. తాజాగా కురిసిన భారీ వర్షాలతో మరింత తీవ్ర నష్టం జరిగింది. సుమారు 17 జిల్లాల్లో పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
Cyclone GHMC : మరో రెండ్రోజులు వర్షాలు
సముద్రమట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఆవర్తనం ఏర్పడింది. ఆవర్తనానికి సమాంతరంగా ద్రోణి కొనసాగుతోంది. ఫలితంగా 23 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ today weather అంచనా వేసింది. శుక్ర, శనివారాల్లో నిజామాబాద్, కామారెడ్డి ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, యాదాద్రి, వికారాబాద్, జనగామ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, భూపాలపల్లి, భద్రాద్రి, జోగులాంబ గద్వాల, ములుగు, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే rains alert today అవకాశం ఉంది.
state rai fall
GHMC rain