అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆదివారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి రోజు రూ.48 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. తెలంగాణ, ఆంధ్రలో రూ.35 కోట్లు, దేశంలోని మిగతా ప్రాంతాల్లో నాలుగు కోట్లు, ఓవర్సీస్‌లో రూ.9 కోట్లు కలెక్ట్ చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్‌లుగా నటించారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Aditya 369 : ఆదిత్య 369 కోసం చిరంజీవి ప్రమోషన్.. 20 సెకన్ల యాడ్ చేశారా నిర్మాత సంచలన కామెంట్స్..!