Advertisement
అక్షరటుడే,వెబ్డెస్క్: ప్రముఖ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిన ‘ఢీ’ షో డ్యాన్సర్ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మంలోని పొన్నెకల్లో నివాసముండే కావ్యకల్యాణి అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. తనను డ్యాన్సర్ అభి అనే వ్యక్తి మోసం చేశాడని పేర్కొంటూ ఆమె సెల్ఫీ వీడియో రికార్డు చేసింది. తనను పెళ్లి చేసుకున్నాక.. తనకు తెలియకుండానే మరో పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఆమె వాపోయింది. అనంతరం ఆమె ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది.
Advertisement