అక్షర టుడే, ఆర్మూర్‌ : పట్టణంలోని నటరాజ నృత్యనికేతన్‌ నిర్వాహకురాలు, నాట్యకారిణి మృణాళిని డాక్టరేట్‌ పట్టా అందుకున్నారు. శనివారం ఢిల్లీలో వరల్డ్‌ హ్యూమన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ప్రముఖులను డాక్టరేట్‌తో సత్కరించారు. ఇందులో భాగంగా ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ విభాగంలో మృణాళిని డాక్టరేట్‌ అందుకున్నారు. ఆంధ్ర నాట్యంలో 20 ఏళ్లుగా కృషితోపాటు, సనాతన ధర్మం, సంస్కృతి సంబంధ కార్యక్రమాలతో విద్యార్థులకు శాస్త్రీయ నృత్యం నేర్పిస్తున్నారు. ఈ మేరకు ఆమెకు డాక్టరేట్‌ రావడంపై పలువురు అభినందించారు.