అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలోని గోల్ బంగ్లా సమీపంలోని దత్తాత్రేయ మందిరంలో ఆర్మూర్ క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో శనివారం దత్త జయంతిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.