David Warner | రాబిన్ హుడ్ డేవిడ్ వార్నర్ లుక్.. తెర మీద అదరగొట్టేందుకు రెడీ..!

David Warner | రాబిన్ హుడ్ డేవిడ్ వార్నర్ లుక్.. తెర మీద అదరగొట్టేందుకు రెడీ..!
David Warner | రాబిన్ హుడ్ డేవిడ్ వార్నర్ లుక్.. తెర మీద అదరగొట్టేందుకు రెడీ..!
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: David Warner | క్రికెట్​లో సిక్సుల వరద కురిపించిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు వెండితెరపై అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఆస్ట్రేలియా క్రికెట్ టీం నుంచి రెస్ట్ తీసుకుంటున్న ఈ క్రికెటర్ తెలుగు ఆడియన్స్​కు బాగా దగ్గరయ్యాడు. అంతకు ముందు ఎస్​ఆర్​హెచ్ టీం కెప్టెన్​గా డేవిడ్ వార్నర్ తెలుగు ఆడియన్స్​కు దగ్గర కాగా.. పుష్ప‌‌–1, పుష్ప–2లోని డైలాగ్స్, సాంగ్స్ ని రీల్స్ చేస్తూ పాపులర్ అయ్యాడు.

Advertisement

తెలుగు ఆడియన్స్​కు డేవిడ్ వార్నర్ అంటే ప్రత్యేకమైన అభిమానం తెలుగు స్టార్స్​కు ఆయన స్పెషల్. స్టార్స్ కి బర్త్ డే గ్రీటింగ్స్ ఇంకా ప్రత్యేకమైన సందర్భాల్లో వారి గురించి మాట్లాడతాడు. కొన్నాళ్లుగా డేవిడ్ వార్నర్‌ను సిల్వర్ స్క్రీన్‌పై తీసుకురావాలని ప్రయత్నం జరుగుతుంది. ఐతే అది రాబిన్ హుడ్ వల్ల జరుగుతుంది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో డేవిడ్ వార్నర్ నటించాడు.

David Warner | డేవిడ్ వార్నర్ కూల్ లుక్‌తో..

ఇంతకీ వార్నర్ ఏ పాత్రలో కనిపిస్తాడు.. ఎలా అలరిస్తాడు అన్నది తెలియదు. కానీ మార్చి 28న రిలీజ్ అవుతున్న రాబిన్ హుడ్ సినిమా నుంచి లేటెస్ట్‌గా డేవిడ్ వార్నర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. డేవిడ్ వార్నర్ కూల్ లుక్‌తో అదరగొట్టాడు. మరి నితిన్ సినిమాలో వార్నర్‌ను ఎలా వాడుకున్నారు. ఈ సినిమాకు అతను ఎంత ప్లస్ అవుతాడు అన్నది తెలియాల్సి ఉంది.

డేవిడ్ వార్నర్ సినిమాలో ఉన్నాడని తెలిసి రాబిన్ హుడ్ మీద స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమాపై ఇప్పటికే ఒక పాజిటివ్ టాక్ ఉంది. ఈ సినిమాతో నితిన్ కచ్చితంగా హిట్ కొట్ట‌బోతున్నాడని చెప్పుకుంటున్నారు. మరి సినిమా రిజల్ట్ ఏంటన్నది మార్చి 28న తెలుస్తుంది. ఇప్పటికే ప్రచార చిత్రాలతో రాబిన్ హుడ్ మంచి బజ్ ఏర్పర్చుకోగా.. సినిమా తప్పకుండా అంచనాలను అందుకునేలా ఉందని అనిపిస్తుంది.