అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నగరంలోని ప్రగతినగర్‌లో దేవిటాకీస్‌ సమీపంలోని ఓ ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బందెల శ్రీనివాస్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, భార్య అంగన్వాడీ టీచర్‌గా చేస్తోంది. శుక్రవారం వీరిద్దరూ డ్యూటీకి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న శ్రీనివాస్‌ అమ్మ ఇంటికి తాళం వేసి పక్కింటికి వెళ్లింది. ఈ సమయంలో గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళం పగులగొట్టి లోనికి చొరబడ్డారు. బీరువాలోని రూ.4.5లక్షలు, రెండు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఈ మేరకు నాలుగో టౌన్‌ ఎస్సై పాండేరావు సిబ్బందితో చేరుకుని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామన్నారు.