అక్షరటుడే, ఇందూరు: ఉనికి కోసం ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్‌పై అసత్యప్రచారాలు చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఎవరి హయాంలో క్రైం రేట్ పెరిగిందో బహిరంగ చర్చ పెడదామని, కవిత సిద్ధమా అని సవాల్ విసిరారు. జిల్లా ప్రజలు ఎప్పుడో కవితను మరిచిపోయారన్నారు. కేవలం తమ ఉనికి కోసమే ఆమె కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా ప్రజలకు ఏనాడు కవిత అందుబాటులో లేదన్నారు. పోలీస్‌శాఖను తమ స్వార్థం ఉపయోగించుకున్న పార్టీ బీఆర్‌ఎస్ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో పథకాలు ప్రకటించి.. అమలు చేస్తున్నామన్నారు. రైతుబంధును బీఆర్‌ఎస్ హయాంలో పూర్తిగా దుర్వినియోగం చేశారని విమర్శించారు.
ఉనికి కోసమే కాంగ్రెస్‌పై కవిత దుష్ప్రచారం
Advertisement
Advertisement