అక్షరటుడే, ఇందూరు: బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలపై ఎన్నో దాడులు జరిగాయని డీసీసీ అధ్యక్షుడు, సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తుందని విమర్శించడం సరికాదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఎంతోమందిపై అక్రమ కేసులు పెట్టారని, కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేయించారన్నారు. ఈ ఘటనలపై ఎప్పుడు బహిరంగ చర్చ పెట్టినా సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. ఆర్మూర్‌లో ఓ సర్పంచ్‌ను తప్పుడు ఆరోపణలతో జైలుకు పంపిన నీచ చరిత్ర జీవన్ రెడ్డిది అని పేర్కొన్నారు. పదేళ్లు దౌర్జన్యం చేసిన చరిత్ర ప్రశాంత్ రెడ్డిది అని విమర్శించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజిరెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు జావిద్ అక్రమ్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్, రాజా నరేందర్ గౌడ్, శేఖర్ గౌడ్, శ్రీనివాస్, సుభాష్ జాదవ్, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.