Dominican Republic | డొమినికన్ రిపబ్లిక్‌లో ఘోర ప్రమాదం.. నైట్‌క్లబ్‌లో పైకప్పు కూలిపోయి 66 మంది దుర్మరణం

Dominican Republic | డొమినికన్ రిపబ్లిక్‌లో ఘోర ప్రమాదం..నైట్‌క్లబ్‌లో పైకప్పు కూలిపోయి 66 మంది మృతి
Dominican Republic | డొమినికన్ రిపబ్లిక్‌లో ఘోర ప్రమాదం..నైట్‌క్లబ్‌లో పైకప్పు కూలిపోయి 66 మంది మృతి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dominican Republic డొమినికన్ రిపబ్లిక్ రాజధానిలో ఘోర ప్రమాదం సంభవించింది. అక్కడి ఒక నైట్‌క్లబ్‌లో పైకప్పు కూలిపోవడం(roof collapses)తో ప్రముఖ గాయకుడు, ఒక ప్రాంతీయ గవర్నర్, మాజీ మేజర్ లీగ్ బేస్‌బాల్ పిచర్ ఆక్టావియో డోటెల్(former Major League Baseball pitcher Octavio Dotel) సహా సుమారు 66 మంది మరణించారు. మరో సుమారు 155 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు మంగళవారం ప్రకటించారు.

Advertisement
Advertisement

జెట్ సెట్ నైట్‌క్లబ్(Jet Set nightclub) శిథిలాల కింద నుంచి క్షతగాత్రులను బయటకు తీశారు. శిథిలాల తొలగింపును వేగవంతంగా పూర్తి చేసినట్లు అధ్యక్ష ప్రతినిధి హోమెరో ఫిగ్యురోవా(presidential spokesman Homero Figueroa) ఒక ప్రకటనలో తెలిపారు.

మరణించిన వారిలో ప్రముఖ డొమినికన్ గాయకుడు రూబీ పెరెజ్(Dominican singer Ruby Perez) కూడా ఉన్నారు. ఆయన నిర్వహించిన కచేరీ సందర్భంగా ఈ విపత్తు సంభవించిందని అతని మేనేజర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులు, క్రీడాకారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో చాలా మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు.

Advertisement