అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal : భీమ్‌గల్ మండలంలోని చేంగల్ గ్రామానికి చెందిన సంగెం శారద (47) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై జి మహేష్ గురువారం తెలిపారు. శారద భర్త 10 సంవత్సరాల క్రితం మృతి చెందారని చెప్పారు. కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు తీరే మార్గం లేక బుధవారం ఇంట్లో నాఫ్తలిన్ బిల్లలు మింగారన్నారు. గ్రహించిన ఆమె కూతురు రోస్లి వెంటనే ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నారు. చికిత్స చేసిన డాక్టర్లు రాత్రికి ఇంటికి పంపించారని, అర్ధరాత్రి సమయంలో వాంతులు కావడంతో 108 అంబులెన్స్ లో నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారన్నారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందినట్లు ఆయన తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Bheemgal | అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య
Advertisement
Advertisement