Advertisement
అక్షరటుడే, బోధన్ : Bodhan | గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందిన ఘటన బోధన్ మండలం కల్దుర్కి వద్ద జరిగింది. బుధవారం రోడ్డు దాటుతున్న జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జింక కళేబరాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Advertisement