అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం తరపున రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాజ్యాంగంపై చర్చను శుక్రవారం ప్రారంభించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా పార్లమెంట్‌లో రెండురోజులపాటు రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ చేపట్టారు. ‘రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన కొందరి పాత్ర విస్మరణకు గురైంది. స్వాతంత్య్ర ఉద్యమ పోరాటస్ఫూర్తి నుంచి ఈ రాజ్యాంగం ఉద్భవించింది’ అని మంత్రి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీపై పరోక్షంగా విమర్శలు చేశారు. దీంతో విపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. శనివారం వరకు కొనసాగే ఈచర్చకు ముగింపుగా ప్రధాని మోదీ సమాధానం ఇస్తారు.