భార్యను చంపి డ్రైనేజీలో పడేసిన భర్త.. దుర్మార్గుడిని పోలీసులకు పట్టించిన భార్య ముక్కుపుడక

భార్యను చంపి డ్రైనేజీలో పడేసిన భర్త.. దుర్మార్గుడిని పోలీసులకు పట్టించిన భార్య ముక్కుపుడక
భార్యను చంపి డ్రైనేజీలో పడేసిన భర్త.. దుర్మార్గుడిని పోలీసులకు పట్టించిన భార్య ముక్కుపుడక

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఈరోజుల్లో నేరాలు పెరుగుతున్నాయి. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్లపై నేరం జరిగితే ఏదైనా వివాదాల వల్ల అనుకోవచ్చు కానీ, సొంత వాళ్లనే ఈ మధ్య ఎక్కువగా మట్టుపెట్టేస్తున్నారు. సొంత భార్యను భర్త, భర్తను భార్య, తండ్రిని కొడుకు, కొడుకును తండ్రి, తల్లిని కొడుకు ఇలా మానవ సంబంధాలు రోజురోజుకూ మంటగలిసిపోతున్నాయి అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త.. తన భార్యను చంపి ఆమె బాడీని డ్రైనేజీలో పడేశాడు. అయితే ఆమె బాడీని గుర్తించడంలో, అసలు ఈ నేరం ఎవరు చేశారు అనే విషయంలో పోలీసులకు ఆమె పెట్టుకున్న ముక్కు పుడక సాయం చేసింది. ఆ ముక్కు పుడక ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా, అసలు గుట్టు వీడింది.

Advertisement

ఈ ఘటన జరిగి నెల కావస్తున్నా అసలు ఈ నేరానికి పాల్పడింది ఎవరు అనే విషయం తెలియక పోలీసులు సతమతమయ్యారు. మార్చి 15న బెడ్ షీట్ కి చుట్టి రాయి కట్టి డ్రైనేజీలో పడేసి ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు చూశారు. తన ముక్కు పుడక ఆధారంగా ఆ మహిళ ఎవరో పోలీసులు గుర్తించారు. ముక్కు పుడక లెడ్ మీద ఉన్న నెంబర్ ఆధారంగా ఆ ముక్కు పుడకను సౌత్ ఢిల్లీలోని ఓ జ్యూయలరీ స్టోర్ లో కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆ ముక్కు పుడకను అనీల్ కుమార్ కొన్నట్టుగా రికార్డుల్లో ఉంది. ఆయన ప్రాపర్టీ డీలర్. గురుగ్రామ్ లోని తన ఫామ్ హౌస్ లో నివసిస్తూ ఉంటాడు. ఆ మహిళ 47 ఏళ్ల సీమా సింగ్ గా పోలీసులు గుర్తించారు.

రివర్స్ గేమ్ ఆడిన పోలీసులు

దీంతో అనిల్ కుమార్ అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్లిన పోలీసులు సీమా సింగ్ గురించి ఎంక్వయిరీ చేయగా ఆమె తన భార్య అని చెప్పాడు. మరి, ఆమె ఎక్కడ అని పోలీసులు అడగగా, తను ఫోన్ తీసుకెళ్లడం మరిచిపోయిందని, తను వేరే ఊరికి వెళ్లినట్టుగా చెప్పాడు అనీల్. దీంతో పోలీసులకు అనీల్ మీద అనుమానం పెరిగింది. ఆ తర్వాత అనీల్ కుమార్ ఆఫీసుకు వెళ్లి అక్కడ సెర్చ్ చేయగా, అనీల్ అత్తయ్య నెంబర్ డైరీలో కనిపించింది. ఆ నెంబర్ కు పోలీసులు కాల్ చేయగా, సీమా సింగ్ సోదరి బబిత ఫోన్ లిఫ్ట్ చేసి తనతో మార్చి 11 నుంచి మాట్లాడలేదని చెప్పుకొచ్చింది. దీంతో తమదైన స్టయిల్ లో పోలీసులు అనీల్ ను విచారించగా ఆ నేరం తానే చేశానని చెప్పాడు. బాడీని పోస్ట్ మార్టమ్ చేసి సీమా తల్లిదండ్రులకు అప్పగించారు. సీమాను చంపేందుకు సహకరించిన కుమార్ ఫ్రెండ్ శివ శంకర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అలా ఒక ముక్కు పుడక ఈ కేసును త్వరగా సాల్వ్ చేయడంలో ఉపయోగపడింది.

Advertisement