కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపర్చిన ఈడీ

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: లిక్కర్‌స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ శుక్రవారం కోర్టుకు తరలించింది. ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. 28 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించిన ఈడీ 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోర్టును కోరింది. ప్రస్తుతం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. లిక్కర్ స్కాం మొత్తం వ్యవహారంలో కేజ్రీవాల్ కింగ్ పిన్ అని దర్యాప్తు సంస్థ పేర్కొంది. మరోవైపు కేజ్రీవాల్‌ అరెస్టుతో ఆప్‌ కార్యకర్తలు ఢిల్లీలో ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.