అక్షరటుడే, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఓ ప్రయాణికుడి నుంచి రూ.1.8 కోట్ల విలువైన 2,723 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ సీజ్ చేసింది. బంగారాన్ని పేస్టుగా మార్చి ప్లాస్టిక్ కవర్‌లో దాచి అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. రాజస్థాన్‌కు చెందిన యువకుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.